1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 మే 2024 (17:38 IST)

రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా? రాహుల్ గాంధీకి కట్టిస్తావా?

ktrao
టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చూపిస్తావా? అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కిట్ ఆగింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కల్యాణ‌లక్ష్మి నిలిచింది. 
 
తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు కూడా ఓ బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి. అన్నీ అబద్ధాలు చెప్తున్నారు.. అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కనబడాలంటే.. చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.