బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (19:08 IST)

హైదరాబాదులో మే 7నుంచి వర్షాలు.. ఉష్ణోగ్రతలు పడిపోతాయ్

Rains
హైదరాబాదులో ఎండలు మండిపోతున్నాయి. 10 రోజులకు పైగా పెరిగే ఉష్ణోగ్రతలను ప్రజలు భరించలేకపోతున్నారు. అయితే ఈ ఎండల నుంచి భాగ్యనగరం ప్రజలకు ఉపశమనం కలుగనుంది. హైదరాబాద్‌తో పాటు  చుట్టుపక్కల ప్రాంతాలకు తీవ్రమైన వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వేడిగాలులు వచ్చే వారం నుండి తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సూచించింది.
 
మే 6 వరకు రాష్ట్రంలో హీట్‌వేవ్ అలర్ట్ కొనసాగుతుండగా, ఆ తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం వుందని తెలుస్తోంది. మే 7 నుండి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. మే 6నాటికే హైదరాబాదులో వర్షాల ప్రభావం వుంటుందని తెలుస్తోంది. 
 
మే 7వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
 
ఈ మార్పు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనాన్ని అందిస్తుంది. వర్షాలు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది.