బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (08:38 IST)

హమ్మయ్య... ఎట్టకేలకు చిరుతను బంధించారు... ఎక్కడ?

Cheetah
హైదరాబాద్ నగరంలోని శ్రీరాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంచరిస్తున్న చిరుత పులిని స్థానిక పోలీసులు, అటవీ సిబ్బంది, ఎయిర్ పోర్టు పోలీసులు ఎట్టకేలకు బంధించారు. గత ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేయగా, ఆ బోనుల్లో ఆ చిరుత పులి చిక్కింది. ఆ తర్వాత చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఏపీ ఎన్నికల ప్రచారంలో హీరోయిన్ నమిత.. ఎవరికోసమంటే..!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ కోసం ప్రచారం చేయాలంటూ సినీ తారలను బరిలోకి దించుతున్నారు. తాజాగా హీరోయిన్ నమిత కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఆమె ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనకు మద్దతుగా నమిత ప్రచారం చేశారు. 
 
ఆమె తన భర్తతో కలిసి ధర్మవరం వచ్చి.. స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ధర్మవరం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు జనాలు విపరీతంగా తరలివచ్చారు. ఏపీలో పొత్తుల్లో భాగంగా, ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడ నుంచి సత్యకుమార్ పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.