గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (12:57 IST)

మహేష్ బాబు, రాజమౌళి కలయికతో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్

Mahesh Babu  Rajamouli hyderabad airport
Mahesh Babu Rajamouli hyderabad airport
మహేష్ బాబు తన కొత్త సినిమా రాజమౌళితో చేయనున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా సందర్భంగా మహేష్ బాబు ఎక్కడ కనిపించినా ఆయన ఆహార్యాన్ని ఫొటోగ్రాఫర్లు ఫొన్ లతోబంధిస్తుంటారు. అలా ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వారికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలే దుబాయ్ వెళ్ళిన రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు.
 
Mahesh Babu hyderabad airport
Mahesh Babu hyderabad airport
కాజువల్ గా టోపీ పెట్టుకునే మహేష్ బాబు పొడవాటి హిప్పీ జుట్టుతో దర్శనమివ్వడం విశేషం. మహేష్ బాబు 29 వ సినిమా కోసం అనేది తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం దుబాయ్ వెళ్ళినట్లు తెలిసింది. అయితే వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం అభిమానులకు పండుగలా వుంది. వీరి వస్తుండగా వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.