సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (12:23 IST)

ఆఫ్రికా ఖండానికి కుర్చీని మడతపెట్టి ఫీవర్.. వీడియో వైరల్

Kurchi Madathapetti
Kurchi Madathapetti
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "గుంటూరు కారం" అనే తెలుగు సినిమా నుండి "కుర్చి మడతపెట్టి" అనే ఆకట్టుకునే పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేష్, శ్రీలీల నటించిన ఎనర్జిటిక్ ట్రాక్, మాస్ డ్యాన్స్ మూవ్‌లు యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
ప్రస్తుతం కుర్చీ మడతపెట్టి ఫీవర్ ఆఫ్రికా ఖండానికి కూడా విస్తరించింది. చాలా మంది ఆఫ్రికన్ పిల్లలు ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పాటకు వారి కొత్త వెర్షన్‌లను సృష్టిస్తున్నారు. 
 
అమెరికాలోని హ్యూస్టన్‌లో ఎన్బీఏ గేమ్ సందర్భంగా జరిగిన ఫ్లాష్ మాబ్ ఈవెంట్‌లో ఈ పాటకు డ్యాన్స్ మాబ్ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల రీల్స్ వచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.