1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (17:21 IST)

హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎన్టీఆర్ !

NTR-airport
NTR-airport
మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ నేడు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు స్టైల్‌గా కనిపించాడు. తాజాగా దేవర సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మూడొంతుల సినిమా పూర్తయింది. ఇక మధ్యలో  హృతిక్ రోష‌న్‌ తో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ అలియా భట్ కూడా నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. 
 
ఈ సినిమా యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ సరికొత్తగా చేయనున్నారని తెలిసింది. తాజాగా యాక్షన్ ఎపిసోడ్ నిమిత్తం ఈ సినిమా షూట్ లో పాల్గొనేందుకు వెళుతున్నట్లు తెలిసింది. సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్. కెరీర్ లో మరో మైలురాయిగా వుంటుందని అభిమానులు తెలియజేస్తున్నారు.