గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (13:43 IST)

టీడీపీలో చేరిన ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు

tdp flag
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అధికార వైకాపాకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వైకాపాను వీడి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిన విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోమారు అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర పార్టీల్లోకి చేరిపోతుండటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది.