మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 మార్చి 2024 (13:57 IST)

వైసిపిలో చేరబోతున్నా, నాతో వచ్చేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకోండి: ముద్రగడ

mudragada padmanabham
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. మార్చి 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరబోతున్నానంటూ బహిరంగ లేఖ రాసారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకూ తన వెంట ర్యాలీగా వచ్చే అభిమానులకు ఓ కీలక విషయాన్ని చెప్పారు.
 
ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలనీ, ఎందుకంటే ర్యాలీలో పాల్గొనేవారికి తను ఆహార సరఫరా ఏర్పాట్లు చేయడంలేదని తెలిపారు. వైసిపిలో ఎందుకు చేరుతున్నారనే దానికి సమాధానం ఇస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
తను ఏ పార్టీలో వున్నా పేదల సంక్షేమానికే కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కాగా కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరడంపై రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతోంది. ముద్రగడ చేరికతో వైసిపికి లాభం జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి వుంది.