మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (12:58 IST)

వైసిపికి నామరూపాలు లేకుండా చేస్తా- ముద్రగడ పద్మనాభం: భీమవరంలో పవన్ కల్యాణ్

Pawan Kalyan and Mudragada
కాకినాడ నియోజకవర్గ పరిధిలో వైసిపికి నామరూపాలు లేకుండా చేస్తానని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. గడప గడపకూ తిరిగి వైసిపి చేసిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పుకొచ్చారు. కాగా కొన్నిరోజులుగా ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ రెండుసార్లు ముద్రగడ ఇంటికి వెళ్లి వచ్చారు.
 
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ముద్రగడ స్పందిస్తూ... పవన్ కల్యాణ్ వస్తే ఒక దణ్ణం పెడతా రాకపోయినా రెండు దణ్ణాలు పెడతానన్నారు.
 
మరోవైపు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన ఈ రోజు ఉదయం మొదలైంది. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పవన్. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.