గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (21:07 IST)

కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్య

doctor
ఏపీలోని కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ భూవివాదం కారణంగా యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూ వివాదం పరిష్కారంలో మోసపోయాననే మనస్తాపంతో పురుగు మందు తాగాడు. 
 
కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ చౌదరి శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తిరిగొచ్చిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. 
 
భూవివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతల సాయం కోరగా.. ఆస్తి పత్రాలు తీసుకుని వేధింపులకు గురిచేశారంటూ శ్రీకిరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు.