1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Love Failure: Lovers attempt suicide in Mancherial

Love Failure: ప్రేమ విఫలం.. ప్రియురాలు రైలుకింద పడితే.. ప్రియుడు బావిలో దూకేశాడు (video)

lovers
ప్రేమ విఫలమైందని ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇక లాభం లేదనుకున్న ఆ జంటలో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ విఫలమైందని ట్రైన్ కింద పడి ప్రియురాలు హితవర్షిణి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ప్రియురాలి మరణ వార్త విని ప్రియుడు వినయ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఘట్కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో హితవర్షిణి బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారని తెలిసింది. అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో ఇలా ప్రేమికులు ప్రేమ కోసం బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 
తర్వాతి కథనం
Bhatti Vikramarka: రుణాలు అవసరం, వేధింపులు కాదు.. ఉదారంగా రుణాలు అందించాలి