సంబంధిత వార్తలు
- ప్రేమోన్మాది దాడి.. కత్తితో దాడి.. యువతి మృతి.. ఆపై విద్యుత్ స్తంభం ఎక్కాడు?
- చీకటి వ్యాపారాలకు విదేశీ అమ్మాయిలు.. నగ్న వీడియోలతో ఎర?
- అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచారం.. సైబరాబాదులో ముగ్గురు అరెస్ట్
- భవిష్యత్ నాశనం చేశారు.. పవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపు : నటి హేమ (Video)
- ఫ్లాట్లో రేవ్ పార్టీ: 39మంది కళాశాల విద్యార్థులు, మైనర్లు అరెస్ట్
గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. 18 మంది అరెస్ట్.. గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు...
భారతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీ సంస్కృతి పెరుగుతోంది. ఇటీవల హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రేవ్ పార్టీలు రెచ్చిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. తాజా ఘటనలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గెస్ట్ హౌస్‌లో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు రేవ్ పార్టీని ఛేదించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సినీ పరిశ్రమకు చెందినవారు సహా మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, రేవ్ పార్టీ సంస్కృతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన పలు కేసుల్లో తరచూ దాడులు నిర్వహించడంతోపాటు అరెస్టులు జరుగుతున్నాయి
