ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

చీకటి వ్యాపారాలకు విదేశీ అమ్మాయిలు.. నగ్న వీడియోలతో ఎర?

romance
హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో చీకటి వ్యాపారాలకు విదేశీ అమ్మాయిలను విస్తృతంగా వాడుకుంటున్నారు. ఇందుకోసం నగ్న వీడియోలతో కస్టమర్లకు ఎర వేస్తున్నాయి. అదేసయంలో తమకు నచ్చిన విదేశీ అమ్మాయితో ఏకాంతంగా గడపేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే.. కాస్త రేటు ఎక్కువ. ఇలా విదేశీ అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని భావించే ప్రతి ఒక్కదానికీ ఎంతోకొంత రేటు చెల్లిస్తే చాలు.. అంతా మీరు అనుకున్నట్టుగానే సాఫీగా సాగిపోతాయి. ఇలాంటి హైటెక్ హైటెక్ వ్యభిచార గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు.
 
విదేశీ యువతులను రప్పించి చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు నిర్ధారించారు. కెన్యా, టాంజానియా తదితర దేశాలకు చెందిన అమ్మాయిలను అక్రమంగా భారత్‌కు తరలిస్తున్న ముఠాలు కొత్త తరహా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గచ్చిబౌలిలో పట్టుబడిన 17 మంది యువతుల్లో కొందరి పాస్‌పోర్టు గడువు ముగిసినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
 
ఒంటరితనం నుంచి బయటపడేందుకు.. సరదాగా మాట్లాడేందుకు సరైన భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చంటూ అంతర్జాలంలో ప్రకటనలిస్తారు. ఆకర్షితులైన వారిని వెబ్‌సైట్లు, యాప్ సభ్యత్వం తీసుకోవాలని షరతు విధిస్తారు. రూ.5-10 వేల వరకు సభ్యత్వ రుసుం వసూలు చేస్తారు. బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్, నైజీరియా దేశాల నుంచి యువతులను ఉద్యోగం, పర్యాటక వీసాలతో నగరానికి చేరవేస్తున్నారు. 
 
మసాజ్ కేంద్రాలు, హోటళ్లు, నివాస ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని అక్కడ వీరితో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు నగరానికి చెందిన పోలీసు అధికారి తెలిపారు. అమ్మాయిలు నగ్నంగా మారి వీడియోకాల్లో మాట్లేడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారితో గడిపేందుకు ఆసక్తి చూపిన విటులకు ఆ ప్రాంతాల్లోని ఏజెంట్ల ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఒక్కో యువతికి రోజుకు రూ.500-1000లోపు కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం.
 
సగరంలోని పలు స్పా సెంటర్లలో వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో వీధివీధినా మర్దన కేంద్రాలున్నాయి. నగరంలోని ఓ ఠాణా పరిధిలో స్పాల నుంచి ప్రత్యేక విభాగానికి నెలకు రూ.5లక్షలు చేరతాయని తెలుస్తోంది. తాజాగా మధురానగర్ ఠాణాలోని నలుగురు పోలీసులకు వ్యభిచారం నిర్వహించే మర్దన కేంద్రంతో సంబంధాలున్నట్లు వెలుగు చూసింది.