గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (14:45 IST)

భవిష్యత్ నాశనం చేశారు.. పవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపు : నటి హేమ (Video)

Hema
కొన్ని మీడియా సంస్థలు తన భవిష్యత్‌ను నాశనం చేశారంటూ సినీ నటి హేమ వాపోతున్నారు. తనకు సంబంధం లేని విషయాల్లో తాను ఉన్నట్టుగా మీడియా కథనాలు వండి వార్చాయని వాపోయారు. బెంగుళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్టు డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రచారం చేశాయని తెలిపారు. అయితే, తనకు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోనట్టు తేలిందన్నారు. ఈ నివేదికలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని, అందువల్ల ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు.

అయితే, మీడియా మాత్రం తన భవిష్యత్ నాశనం చేసిందని చెప్పారు. ఇదే విషయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి తన బాధను చెప్పుకునేందుకు అపాయింట్మెంట్ కోరానని, అందుకోసం ఎదురు చూస్తున్నట్టు హేమ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ టీవీతో మాట్లాడిన ఇంటర్యూ వీడియో వైరల్‌గా మారింది.