అల్లు అర్జున్ వ్యక్తిగత విషయాలకు దానిని వేదికగా చేసుకొబోతున్నారా ?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గురించి కాంట్రవర్సీ కొనసాగుతూనే వుంది. ఇందుకు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో నిలవడ్డదగ్గరనుంచి వారి కుటుంబంలో కొంత గేప్ వచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఆయన తన విషయాలను చెప్పేందుకు వేదిక దొరకలేదు. ఇప్పుడు అది నెరవేరనుందని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ బుధవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఆగస్టు 21న హైదరాబాద్‌లో 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 'మారుతి నగర్ సుబ్రమణ్యం'ను సుకుమార్, తబిత దంపతులు చూశారు. వినోదంతో పాటు చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో తన సమర్పణలో విడుదల చేయడానికి తబిత ముందుకు వచ్చారు. మరి ఆరోజు పుష్ప 2 గురించి మరిన్ని వివరాలు తెలియజేయనున్నారని సమాచారం.