1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Rs 5 Breakfast Among 20 Proposals At GHMC Meet Today

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

South Indian Breakfast
తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన అన్న క్యాంటీన్ల స్ఫూర్తితో అతి తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం రూ. 5కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలోనే ఇకపై రుచికరమైన టిఫిన్ కూడా అందుబాటులోకి రానుంది.
 
గ్రేటర్ పరిధిలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని జీహెచ్ఎంసీ తీర్మానించింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లను ప్రజలకు అందిస్తారు.
 
ఒక్కో టిఫిన్ తయారీకి రూ.19 ఖర్చవుతుందని అంచనా వేయగా, లబ్ధిదారుడి నుంచి రూ.5 వసూలు చేసి, మిగిలిన రూ. 14ను జీహెచ్ఎంసీ సబ్సిడీగా భరించనుంది. ఈ అల్పాహార పథకం కోసం ఏటా సుమారు రూ. 15.33 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 30 వేల మందికి పైగా రూ.5కే భోజనం చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు.  
తర్వాతి కథనం
రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..