మూడు ఎకరాల మామిడి తోటకు నిప్పు పెట్టిందెవరు?
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామం శివార్లలోని మూడు ఎకరాల మామిడి తోట మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. సమాచారం ప్రకారం, తోట నుండి భారీ మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఈ ప్రమాదంలో మామిడి, జామ, కొబ్బరి తోటలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైప్‌లైన్ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం సుమారు రూ.10 లక్షలు ఉంటుందని యజమానులు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపేట గ్రామానికి చెందిన పశువుల కాపరి సుదర్శన్ కావాలనే తోటలో నిప్పు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

