సంబంధిత వార్తలు
- హైదరాబాద్‌కి చెందిన 15 మంది ఆకాశ్ విద్యార్థులు NEET UG 2025లో టాప్ స్కోరర్లు
- Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు
- Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?
- పటానచెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!
- Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య
చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం
హైదరాబాద్ నగరంలోని చింతల్‌కుంట వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంట ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఈ విద్యుత్ వైర్లు తెగిపడటంతో ప్రాణాలు కోల్పోయారు.
చింతల్‌కుంటలోని ప్రధాన రహదారి పక్కనున్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తుంగా, ఆదివారం వేకువజామున సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు భారీ శబ్దంతో వారిపై తెగిపడి, క్షణాల్లో మంటలు అంటుకున్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు మంటల్లోనే కాలిపోయారు.
సమాచారం. అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు వారు యాచకులై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తర్వాతి కథనం
