సంబంధిత వార్తలు
- హైదరాబాద్‌లో కరోనా వైరస్.. హైఅలెర్ట్‌లో తెలంగాణ సర్కారు..
- మంత్రి కేటీఆర్ గారికి ట్వీట్.. నిలిచిన చిన్నారి ప్రాణం
- చికెన్ తింటే ఏ కరోనాలు రావు, భయం లేదు మీరు తినండంటున్న మంత్రి కేటీఆర్
- చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై టిఆర్ఎస్ తుది కసరత్తు
- కేసీఆర్ బడ్జెట్లో ఏం ఇస్తారో?.. బడ్జెట్‌పై 12 గంటల పాటు సమీక్ష
మూడేళ్ల చిన్నారి బాడీలోంచి 11 సూదులు..కావాలనే గుచ్చారా?
మూడేళ్ల చిన్నారి బాడీలోంచి 11 సూదులు బయటపడ్డాయి. అవి శరీరంలోకి ఎలా వెళ్లాయి? ఎవరైనా జొప్పించారా? అనేది తెలియలేదు.
వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పెబ్బిటి అశోక్, అన్నపూర్ణలకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కుమారుడు లోక్ నాథ్(3) ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు.
వారం కిందట తల్లిదండ్రులు ఆ చిన్నారికి స్నానం చేయిస్తుండగా ఒక సూది మజిల్ లోంచి బయటకు చొచ్చుకురావడంతో హాస్పిటల్‌కు తరలించారు.
డాక్టర్లు స్కాన్ చేయగా, నడుము కింది భాగంలో 11 సూదులు ఉన్నట్లు తేలింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఎవరో కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. చిన్నారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించామని, కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
తర్వాతి కథనం