1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (14:58 IST)

చికెన్ తింటే ఏ కరోనాలు రావు, భయం లేదు మీరు తినండంటున్న మంత్రి కేటీఆర్

చికెన్ తింటే కరోనా వస్తుందనే పుకార్లు మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మొద్దని తను, కెసిఆర్ గారు ఇంట్లో చికెన్ తింటున్నాం.. మీరు కూడా టెన్షన్ లేకుండా చికెన్ తినేయమంటున్నారు కేటీఆర్.

ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ‘చికెన్‌, ఎగ్‌ మేళా’ నిర్వహించింది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ. దీనికి మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సినీనటి రష్మిక తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా చికెన్ లాంగించిన నేతలు.. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇక, ఈ మేళాలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మా ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అందరం చికెన్ తింటున్నాం. మీరూ తినండని కోరారు. ఎగ్, చికెన్‌లో ఉండే పౌష్టికాహారం మరెందులో లేదని స్పష్టం చేశారు. 
 
చికెన్ ద్వారా తక్కువ ధరకు పౌష్టికాహారం లభిస్తుందన్న కేటీఆర్.. చికెన్ వల్ల ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు రాలేదని ప్రకటించారు. ఇక, చికెన్‌కు కరోనా వైరస్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతకనే బతకవు అని తెలిపారు కేటీఆర్.