1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 267 new corona cases in Telangana

తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు

corona cases
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 27,471 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 267 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,395కి చేరింది.

నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,583కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 351 మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,86,893కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,919 ఉండగా వీరిలో 2,270 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,42,537కి చేరింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
మరింత పెరిగిన ముడి చమురు ధరలు