మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (21:59 IST)

ఏపీలో 179 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు కొత్తగా 179 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,167 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 179 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో ఈ వైరస్‌ బారినపడి నలుగురు మరణించారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 219 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇప్పటి వరకు 1,24,82,943 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 88,56,16 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,76,140 మంది పూర్తిగా కోలుకోగా, 7,138 మంది మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 మంది ఈ కరోనా వ్యాధికి గురవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరికి కరోనా వచ్చింది.