శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (09:39 IST)

లోక్‌సభ ఉప ఎన్నికలు.. తిరుపతి జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.. పవన్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో గ్రామంలో తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తిరుపతి జనసేన అభ్యర్థికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తిరుపతి బై పోల్‌లో ఎవరు పోటీ చేయాలనే అంశం మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదంటున్నారు. తాజాగా తిరుపతి పర్యటనకు వెళ్లిన ఆయన తిరుపతి బైపోల్ అభ్యర్ధి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదని, మరో రెండు మూడు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు. ఢిల్లీ స్థాయిలో మరోసారి చర్చించిన తర్వాతే అభ్యర్థిపై స్పష్టత వస్తుందని పవన్ పేర్కొన్నారు. 
 
అయితే జనసేన నుంచి అభ్యర్థిని పెట్టాలని క్యాడర్ గట్టిగా అడుగుతుందని ఒకవేళ జనసేన తరపున అభ్యర్థి బరిలోకి దిగితే తాను ఏడు నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పవన్ చెప్పుకొచ్చారు.