1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. A man came Wedding gestures, Affair with Aunt

పెళ్ళి చూపులకొచ్చి అత్తను లైన్‌లో పెట్టిన అల్లుడు... ఎక్కడ?

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లితో సమానమైన కాబోయే అత్తతోనే సంబంధం పెట్టుకున్నాడు ఒక అల్లుడు. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె కుమార్తె పెళ్ళి వాయిదా వేసుకుంటూ వచ్చాడు.

man
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లితో సమానమైన కాబోయే అత్తతోనే సంబంధం పెట్టుకున్నాడు ఒక అల్లుడు. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె కుమార్తె పెళ్ళి వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఏం జరిగిందోనని మామ ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో కోపంతో మామ ఆ యువకుడ్ని దారుణంగా చంపేశాడు.
 
సంగారెడ్డి జిల్లా జ్యోగిపేటకు చెందిన పాపయ్య, ఎల్లమ్మ దంపతులు. వీరికి 19 యేళ్ల కుమార్తె ఉంది. పెయింటింగ్ వర్క్ చేస్తున్న పోతిరెడ్డిపాళెంకు చెందిన ఎల్లయ్య వీరి ఇంటికి పెళ్ళిచూపుల కోసం వచ్చాడు. పెళ్లిచూపుల్లో అమ్మాయికి బదులు అత్తకు లైన్ వేశాడు. మెల్లగా ఆమె ఫోన్ నెంబర్‌ను తీసుకుని లైన్‌లో పెట్టాడు. 
 
ఆమెతో మూడు నెలల పాటు అక్రమ సంబంధం కొనసాగించాడు. మామ పాపయ్య పెళ్ళి విషయం ఎత్తితే మాత్రం తరువాత చూద్దామని చెప్పి తప్పించుకునేవాడు. దీంతో మామకు అనుమానం వచ్చింది. వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న పాపయ్య ఎల్లయ్యను పెళ్ళి విషయమై ఇంటికి రమ్మని పిలిచాడు.
 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపయ్య ఎల్లయ్యతో గొడవపెట్టుకుని అతని తలపై రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక ఉన్న పొదల్లో పూడ్చేశాడు. పెళ్ళి విషయం మాట్లాడటానికి వెళ్ళిన ఎల్లయ్య ఎంతకూ రాకపోవడంతో అతని బంధువులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
About Writer
TJ
తర్వాతి కథనం
రోజాకు సొంతింటి కుంపటి.. ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..