సంబంధిత వార్తలు
- కేసీఆర్తో బంధుత్వం లేదు.. కానీ మళ్లీ సీఎంగా ఆయనే.. : పోసాని కృష్ణమురళి
- తెలంగాణ ఇస్తున్నట్టు సోనియా చెప్పాకే.. కేసీఆర్ నన్ను తరిమేశారు : విజయశాంతి
- రేవంత్ రెడ్డి స్వాతిముత్యంలో కమల్ కాదు.. విశ్వరూపంలో కమల్ హాసన్- బాల్క సుమన్
- మా నాన్న మాపై ఏం చేస్తాడో తెలుసా? అక్కాచెల్లెళ్లు చెప్పింది వినీ...
- ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ నాపై కుట్రలు పన్నుతున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానంటున్న రాములమ్మ..?
తెలంగాణా రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళుతున్న తరుణంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్థం కొనసాగుతోంది.
తెలంగాణా రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళుతున్న తరుణంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్థం కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టిఆర్ ఎస్ రకరకాల పన్నాగాలను కొనసాగిస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలను అరెస్టులు చేయించుకుంటూ, వారి ఇళ్ళపై ఐటీ దాడులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేయిస్తోందన్న ఆరోపణలు లేకపోలేదు. అంతే కాదు కొంతమంది ఇంటి దారి పట్టిన నేతలను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా వారికి పార్టీ పదవులతో పాటు అధికారం వస్తే నామినేటెడ్ పదవులను ఇచ్చేందుకు సిద్థమని ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కోరిక మేరకు ఏకంగా నటి విజయశాంతి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి సిద్థంగా ఉన్నారు రాములమ్మ. ధర్మక్షేత్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్థంగా ఉన్నారని ప్రకటిస్తున్నారామె. అయితే గత కొన్నినెలలుగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన రాములమ్మ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ముందుకు వెళుతుండడం కొంతమంది నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంతమంది విజయశాంతిని వ్యతిరేకిస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని రాములమ్మ ప్రతిచోటా శపథం కూడా చేసేస్తున్నారు.
