గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:54 IST)

పెళ్లి చేస్కున్నావా టెక్కీ? నీకు నరకం చూపిస్తా... స్నేహం చేసిన పాపానికి...

హైదరాబాద్ బోడుప్పల్ నివాసం ఉంటున్న మహ్మద్ పాషాకు ఐదేళ్ల క్రితం ఇంజనీరింగ్ చదివే సమయంలో అశోక్ నగర్‌కు చెందిన అమ్మాయితో పరిచయం అయింది. వీరు ఇరువురు ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాక పాషా ఎం.టెక్‌లో చేరగా ఆమె ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అప్పు

హైదరాబాద్ బోడుప్పల్ నివాసం ఉంటున్న మహ్మద్ పాషాకు ఐదేళ్ల క్రితం ఇంజనీరింగ్ చదివే సమయంలో అశోక్ నగర్‌కు చెందిన అమ్మాయితో పరిచయం అయింది. వీరు ఇరువురు ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాక పాషా ఎం.టెక్‌లో చేరగా ఆమె ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అప్పుడప్పుడూ పాషా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. 
 
తల్లిదండ్రులు ఆమెకు గత జూలై నెలలో వివాహం జరిపించారు. అప్పుడు మాటల సందర్భంలో పాషాకు తన వివాహం గురించి చెప్పినప్పడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 5 ఏళ్లు కలిసి తిరిగాం. స్నేహితులుగా ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం. అన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు నాకు పెళ్లి జరిగింది అంటే ఎలా కుదురుతుంది. 
 
నీవు నన్ను స్నేహితుడు అనుకున్నావేమో... నేను మాత్రం నిన్ను ప్రేమించాను. నీవే నా సొంతం అనుకున్నాను.. ఇప్పుడు నీవు వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఊరుకుంటానని అనుకుంటున్నావా? నీ పెళ్లి చెడగొట్టను .. కానీ నీకు నరకం చూపిస్తా అంటూ  వికృతంగా మాట్లాడాడు.. నీ భర్తకు విషయం చెప్పు నీకు ధైర్యం చెపుతాడేమో అంటూ బెదిరించాడు. కొంత కాలానికి ఆమె భర్త ఫోన్ నంబరు తెలుసుకుని ఆమె తాను ఉన్న ఫోటోలను పంపించాడు. 
 
అక్కడితో ఆగకుండా బాధితురాలికి ఫోన్ చేసి అశ్లీల వీడియోలు, ఫోటోలు ఫేస్‌బుక్‌లో ఉంచుతానని బెదిరించాడు. దీంతో సదరు యువతి షాక్‌కు గురై ఆసుపత్రిలో చేరింది. కొద్దిరోజులు పాటు ఇతడి వేధింపులు భరించిన ఆ యువతి  చివరికి భర్త అంగీకారంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.