శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (16:58 IST)

ఇంట్లో చొరబడి వెనక నుంచి మహిళను హత్తుకున్న కామాంధుడు... చితక్కొట్టారు

లోయనగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లోకి వెళ్లిన కుమార్ అనే వ్యక్తి.. పిల్లాడికి పాలు కలుపుతుండగా గడియ పెట్టి వెనుక నుంచి ఆమెను హత్తుకున్నాడు. ఆమె గట్టిగా అరవడంతో గడియ తీసి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడికి వచ్చిన చుట్టుపక్క మహిళలు.. జరిగిన సంఘటన తెలుసుకొని కుమార్‌కు దేహశుద్ది చేశారు.
 
స్తంభానికి కట్టి చితక్కొట్టారు. కుమార్ గతంలోనూ మహిళలను చూసి వెకిలి వేషాలు వేసే వాడనీ, నగ్నంగా ఇంటి ముందు తిరుగుతూ మహిళలు బయటకు రాకుండా చేస్తున్నాడని బస్తి మహిళలు వాపోయారు. ఇంట్లో వారందరూ ఏదో కేసుపై జైలుకు వెళ్లారని.. కుమార్ పైన పలుమార్లు ఫిర్యాదు చేసిన అత్తగారింటికి వెళ్లి వచ్చినట్టు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మళ్ళీ రెండు రోజుల్లో వచేస్తున్నడని ఆరోపించారు.
 
ఈ సారైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బస్తీ మహిళలు. కుమార్ మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్తూ తనకు మతి స్థిమితం సరిగా లేదంటూ చెప్పుకు వచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తుకారం గేట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు