సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (15:27 IST)

ట్రంప్ దంపతుల వెన్నంటే వచ్చిన ఓ భారతీయ మహిళ ఎవరు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. ట్రంప్ దంపతుల వెన్నంటే వచ్చిన ఓ భారతీయ మహిళ కూడా కార్పెట్‌పై నడిచారు. ప్రపంచమెరిగిన ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య కనిపించిన ఆ మహిళ ఎవరూ అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు గురుదీప్ చావ్లా. అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన మహిళ. ఆమెకు ట్రాన్స్‌లేటర్‌గా 27 ఏళ్ళ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. ఒక్క పీఎం మోదీనే కాదు.. గతంలో వీపీ సింగ్, చంద్రశేఖర్, నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌ల వద్ద కూడా పని చేశారు.
 
1990లో గురుదీప్ చావ్లా ఇండియన్ పార్లమెంట్‌లో అనువాదకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె వయసు 21. 2015 రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా బరాక్ ఒబామాకు కూడా ఆమె ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రధాని ఏ దేశానికి వెళ్లినా ఆమె వెంటే వుంటారు. ఆయన హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇంగ్లీష్‌‌లోకి అనువదించి ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులకు వివరిస్తారు. 
 
మరోవైపు గతంలో భారత పర్యటనకు విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కూడా గురుదీప్ సేవలు అందించారు. కాగా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయంలో ట్రంప్, మెలానియా ట్రంప్, నరేంద్ర మోదీలతో గురుదీప్ చావ్లా రెడ్ కార్పెట్‌‌లో నడిచిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.