సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (19:01 IST)

TrumpInIndiaBBC: డోనల్డ్ ట్రంప్, మెలానియా తాజ్‌మహల్ సందర్శన - LIVE

ట్రంప్-మెలానియా
అహ్మదాబాద్ పర్యటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పర్యటక కేంద్రం ఆగ్రా చేరుకున్నారు. భార్య కలిసి మెలానియాతో కలిసి తాజ్‌మహల్ సందర్శించారు. తాజ్‌మహల్ సుసంపన్నమైన, వైవిధ్యమైన భారత సాంస్కృతిక సౌందర్యానికి కాలాతీతమైన చిహ్నమని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాశారు.
 
రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ సోమవారం భారత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. 
 
మొటేరా స్టేడియంలో ట్రంప్, మోదీ ప్రసంగం
ఆగ్రా సందర్శనకు ముందు అహ్మదాబాద్‌‌లోని మోటేరా స్టేడియంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. భారత దేశాన్ని, భారత సంస్కృతిని, భారత్ సాధించిన ఘనతను, తన పాలనను ప్రశంసిస్తూ ట్రంప్ చేసిన ప్రసంగానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. సడలని విశ్వాసం కల్గిన మంచి మిత్రులుగా భారత్-అమెరికా దేశాలను మోదీ అభివర్ణించారు.
 
ఘన స్వాగతం పలికిన భారతీయులకు, మోదీ ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్, గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ అమెరికా అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్ట్ పై ట్రంప్ తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. అమెరికా అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ట్రంప్ ప్రశంసిచారు.
 
ఇరు దేశాలకు ప్రయోజనం కల్గించేలా ప్రధాని మోదీతో చర్చలు జరుపుతానని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ కాస్త క్లిష్టమైనదేనని అన్నారు. భారత్‌తో మా అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ షేర్ చేసుకుంటామని ట్రంప్ చెప్పారు. "మేం భారత్‌కు రక్షణ పరికరాలు అందిస్తాం. భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తాం" అన్నారు.
 
3 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక మిలిటరీ హెలికాప్టర్స్, ఇతర మిలిటరీ పరికరాలను భారత సైన్యానికి అందించేందుకు రెండు దేశాలూ రేపు ఒప్పందం చేసుకోబోతున్నాయని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. తీవ్రవాదంపై కలిసి పోరాడాలని భారత్-అమెరికా దృఢ సంకల్పంతో ఉన్నాయని ట్రంప్ చెప్పారు. "మేం ఇస్లామిక్ స్టేట్‌ను అంతం చేశాం. అల్ బగ్దాదీని అంతం చేసింది మేమే" అన్నారు.
 
రెండు దేశాలు ఉగ్రవాద పీడిత దేశాలేనన్న ట్రంప్ తన నేతృత్వంలో ఐసిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని చెప్పారు. పాకిస్తాన్‌తో తమకు సృహద్భావ సంబంధాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌తో కలిసి పని చేస్తున్నామని అన్నారు.
 
భారత దేశాన్ని తిరుగులేని ఆర్థిక శక్తిగా అభివర్ణించిన ట్రంప్ గడిచిన ఏడు దశాబ్దాల్లో తిరుగులేని అభివృద్ధి సాధించిందని చెప్పారు. గడిచిన పదేళ్లలో పేదరికాన్ని ప్రారదోలారగల్గారని. మోదీ నాయకత్వంలో దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని ట్రంప్ అన్నారు. అన్ని దేశాలకు ఆదర్శంగా భారత్ నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
 
తెలివితేటలకు, సృజనాత్మకతకు భారత్ పెట్టింది పేరన్నారు. భారతీయ సంస్కృతి గురించి, పండగల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వివిధ మతాలకు చెందిన ప్రజలు, వందకుపైగా భాషలు ఇలా భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకగా నిలుస్తోందని ట్రంప్ చెప్పారు.
 
అమెరికాలోని భారతీయులు సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో తిరుగులేని ప్రతిభను చూపిస్తున్నారంటూ ప్రసంసల జల్లు కురింపించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అమెరికా ఆర్థికరంగం పరుగులు తీస్తోందని, తన హయాంలో అమెరికన్ మిలటరీ ప్రపంచ శక్తిగా అవతరించిందన్నారు. మెలానియా ట్రంప్‌తో కలిసి మహాత్మాగాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన మర్చిపోలేని అనుభూతినిచ్చిందన్నారు.
 
నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్. భారత్ అంటే అమెరికాకు ఎంతో గౌరవం అని వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితం టెక్సస్‌లో మోదీ ఆహ్వానం పలికితే.. ఇప్పుడు తనకు మొతేరా స్టేడియంలో ఘన స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. మొతేరా స్టేడియం అద్భుతంగా ఉందని, తనకు అద్భుత స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ఆతిథ్యాన్ని తన కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేదని ట్రంప్ అన్నారు.
 
ఇవాళ ప్రపంచమంతా ట్రంప్ ఏం మాట్లాడతారోనని ఎదురు చూస్తున్నారని మోదీ అన్నారు. భారత పర్యటనకు వచ్చినందుకు మెలానియా ట్రంప్, ఇవాంకా దంపతులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
నమస్తే అన్న పదానికి లోతైన అర్థం ఉందన్న మోదీ, ట్రంప్ నాయకత్వంలో రెండు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని వ్యాఖ్యానించారు. మొతేరా స్టేడియంలో ఇవాళ కొత్త చరిత్ర ప్రారంభమయ్యిందని మోదీ అన్నారు. అమెరికా నుంచి అహ్మదాబాద్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత కూడా ఎలాంటి విశ్రాంతి లేకుండా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ పరివారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
 
భారత్ మాతాకి .. అంటూ ప్రసంగాన్ని తన ప్రారంభించిన మోదీ. నమస్తే ట్రంప్ , భారత్-అమెరికా సంబంధాలు వర్ధిల్లాలి అంటూ కొనసాగించారు. మొతేరా స్టేడియంలో ఇరు దేశాధినేతలకు పెద్ద ఎత్తున అభివాదం చేసిన జనం. జాతీయ గీతం జనగణమనతో ప్రారంభమైన సభ. భారత హోమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇతర ప్రముఖులు సభకు హాజరైన వారిలో ఉన్నారు.