శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (13:04 IST)

అమెరికాలో పెట్టుబడి.. భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలను సృష్టించిన భారతీయ కంపెనీల సీఈఓలతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. ట్రంప్‌తో సమావేశంలో పాల్గొనే భారతీయ కంపెనీల సీఈఓల్లో మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, భారతర్ ఫోర్గే మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపకులు, జుబిలంట్ గ్రూపు కో-చైర్మన్ బాబా కల్యాణి, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రసేకరన్ సహా మొత్తం 12 మంది సీఈఓలను ట్రంప్ తో సమావేశానికి ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా పాల్గొననున్నారు.  
 
అమెరికాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలకు చెందిన డజన్ల మంది ఎంపిక చేసిన సీఈఓలతో మంగళవారం ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్.. భారతీయ సీఈఓలతో భేటీకి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. అమెరికాలో తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించిన భారతీయ కంపెనీలపై దృష్టిపెట్టనున్నట్టు సమాచారం.