1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Roja Green India challenge.. Arjun Participated

గ్రీన్ ఇండియా ఛాలెంజ్- అర్జున్‌తో మొక్కలు నాటించిన రోజా (Video)

Roja
Roja_Arjun
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం సినిమా హీరో అర్జున్ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయడం జరిగింది. స్వయంగా రోజా వెళ్లి అర్జున్‌తో మొక్కలు నాటించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకి  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ ఎంపీ సంతోష్  చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది. దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనియం అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనంలో జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమని, ఉత్తమ నటి కుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ ప్రత్యేకంగా అభినందించారు.
 
About Writer
శ్రీ