సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (18:01 IST)

"సామజవరగమన" ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది.. వీడియో ఇదిగోండి

Samajavaragamana
అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న అలవైకుంఠపురంలో సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా ‘సామజవరగమన’ పాట ఒక సెన్సేషన్. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను సంగీత ప్రియులు ఎన్నోసార్లు వినేశారు. ఇందుకు ఈ పాటకు యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్, షేర్లు, లైకులే నిదర్శనం. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే..? "సామజవరగమన" ఫుల్ వీడియో సాంగ్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 4కె రిజల్యూషన్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ పాటను సీనియర్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.
 
సిరివెన్నెల సాహిత్యం ఎంత లోతు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇంత మంచి సాహిత్యాన్ని సిద్ధ్ శ్రీరామ్ అంతే గొప్పగా ఆలపించారు. దీనికి థమన్ ఇచ్చిన ట్యూన్ ప్రాణం పోసింది. మొత్తంగా వీరు ముగ్గురూ కలిసి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాటను అందించారు. ఇంకేముంది.. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.