గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (17:50 IST)

కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆర్కే రోజా

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.
 
కాగా.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 66వ పుట్టిన రోజును పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. 1954 ఫిబ్రవరి 17న సిద్ధిపేటలో జన్మించిన కేసీఆర్... ఏటికేడు అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. 
 
ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేసీఆర్‌ను ప్రజలకు చేరువ చేశాయి. రెండోసారి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశాయి. అందువల్లే కేసీఆర్ పుట్టిన రోజును ఓ వేడుకలా జరుపుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్నా, నిధులు లేకపోయినా... ప్రభుత్వ పథకాల్నీ, ప్రాజెక్టుల్నీ కొనసాగిస్తున్నారు కేసీఆర్. 
 
హైదరాబాద్‌ జలవిహార్‌లో కేసీఆర్ లోగోను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామమని తెలిపారు. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీటిలో పాల్గొంటారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు.