శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (14:33 IST)

ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి మేకతోటి సుచరిత

ప్రజల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసింది.  ఇందులో భాగంగా ఈ రోజు విపత్తుల శాఖలో "ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థ"ను ప్రారంభించామని రాష్ట్ర హోంశాఖా మంత్రి సుచరిత అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... తుఫానులు, వరదలు, అతిభారీవర్గాలు, భూకంపాలు, ఉప్పెనలు, సునామీలు, భారీ అగ్ని ప్రమాదాలు, రసాయనిక ప్రమాదాలు ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో నష్టాల తీవ్రతను తగ్గించేందుకు ఈ ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు.
 
ఈ వ్యవస్థలో విపత్తులను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రజలకు మొబైల్ ఫోన్లకు హెచ్చరికలను మెసేజ్ పంపించడంతో పాటుగా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందించే వ్యవస్థ తీసుకుని వచ్చినట్లు తెలిపారు. 
 
దేశంలోనే ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాష్ట్రం లోని 9 కోస్తా జిల్లాల్లో, తీర ప్రాంతంలో 76 మండలాలు, 16 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 8 పర్యాటక ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ వ్యవస్థ ద్వారా విపత్తుల ప్రభావిత ప్రాంతాల్లో నివసించేవారికి ముందస్తు హెచ్చరికలనిస్తుందని అన్నారు. ప్రిన్సిపాల్ కార్యదర్శి వి. ఉషారాణి మాట్లాడుతూ... 250 కిమీ వరకు గాలి వేగాన్ని తట్టుకునేలా ఈ వ్యవస్థ రూపొందించబడిందనీ, తద్వారా తీవ్రమైన తుపానుల సమయంలో కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ సమాచార వ్యవస్థ ఆగినా ఈ ఎర్లీ వార్నింగ్ డిసిమినేషన్ సిస్టమ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఆగిపోకుండా ముందస్తు సమాచారాన్ని తెలియపరుస్తుందన్నారు.

విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు మాట్లాడుతూ.. జాతీయ విపత్తుల సమర్ధ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రూ.87 కోట్ల తో ఈ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు.

ఒరిస్సా తర్వాత రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
 
ఎమర్జెన్సీ ఆపరేషన్ సిస్టంలో భాగంగా 20 రేడియో మొబైల్ సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. వీటి ద్వారా 75 లక్షల మందికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందిని చెప్పారు. ఎల్ అండ్ టి సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.