1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Another elctric bike blast in Dubbaka, house in fire

ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలింది.. రూ.7లక్షల ఆస్తి నష్టం.. ఎక్కడంటే?

fire accident
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులు అక్కడక్కడా పేలిపోవడం వినేవుంటాం. అయితే తాజాగా దుబ్బాకలో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం ఏర్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. చీకోడ్‌ గ్రామానికి చెందిన బీడీ టేకేదారు పుట్ట లక్ష్మీనారాయణ ఆరు నెలల క్రితం రూ.80 వేలు పెట్టి ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా తన ఇంటి ఎదురుగా ఉండే బొందనగారి దుర్గయ్య ఇంట్లో తన బైక్‌కు చార్జింగ్‌ పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో ఈ బైక్ బ్యాటరీ పేలిపోయింది. భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు జడుసుకున్నారు. 
 
చార్జింగ్‌ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఎలక్ట్రిక్‌ వాహనం దగ్ధం కాగా దుర్గయ్య ఇంటికి నిప్పంటుకోవడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోయారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిద అయ్యాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.42,000ల వరకు శాలరీ