గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (22:26 IST)

ఇకపై మీ బండ భారం మీదే... సామాన్యులపై కేంద్రం గుదిబండ... గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ ఎత్తివేత

LPG Cylinder
గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీనితో సామాన్య ప్రజలు ఇకపై గ్యాస్ బండ ఖరీదు ఎంత వుంటే అంత చెల్లించాల్సి వుంటుంది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందినవారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది.

 
ప్రస్తుతం ఎల్పిజీ సిలిండర్ ధర రూ. 1000కి పైనే వుంది. ఇందులో కొంతమొత్తం కేంద్రం సబ్సిడీగా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. దీనితో సామాన్య ప్రజలకు గ్యాస్ బండతో కేంద్రం షాకిచ్చింది. మొత్తం 21 కోట్ల మందికి కేంద్రం తీసుకున్న సబ్సిడీ రద్దు వర్తించనుంది.

 
సబ్సిడీలను గత కొంతకాలంగా ఎత్తివేస్తూ వస్తోంది మోదీ ప్రభుత్వం. 2010లో పెట్రోలు పైనా, 2014లో డీజిల్ పైనా, 2016లో కిరోసిన్ పైనా సబ్సిడీ ఎత్తివేసారు. ఇప్పుడిక 2022లో గ్యాస్ బండపైన సబ్సిడీ ఎత్తివేసింది కేంద్రం.