1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (15:10 IST)

తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ఇస్తే తెరాస ఏం చేసిందో తెలుసా: రాహుల్ గాంధీ ట్వీట్

rahulgandhi
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ... మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ పుట్టిందని, అయితే గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్ర దుష్పరిపాలనకు గురైందని అన్నారు.

 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, దానిని మోడల్ రాష్ట్రంగా నిర్మించడానికి, రైతులు, కార్మికులు, పేదలతో సహా అందరి శ్రేయస్సుకు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారతదేశంలో అతి పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుండి పుట్టింది. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ప్రజల వాణిని విని తెలంగాణ కలను సాకారం చేసేందుకు నిస్వార్థంగా పనిచేసినందుకు నేను గర్వపడుతున్నాను అని #TelanganaFormationDay హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 
ఇంకా ఆయన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. గత 8 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ తీవ్ర దుర్భర పాలనకు గురైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఉజ్వల తెలంగాణను నిర్మించాలనే కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సు తీసుకురావడంపై దృష్టి సారించిన మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం ” అని ఆయన అన్నారు.