మంగళవారం, 13 జనవరి 2026
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (12:07 IST)

గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షలు: జూన్‌ 4వ తేదీ వరకు గడువు పొడిగింపు

exams
తెలంగాణలో గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షల దరఖాస్తుకు గడువు మే 31తో ముగిసింది. మే 2న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ  వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏప్రిల్ 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
తాజాగా గ్రూప్‌–1 దరఖాస్తుల గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు సంబంధిత సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.