శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (12:52 IST)

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ధనిక రాష్ట్రం తెలంగాణ.. జీతాలకు డబ్బుల్లేవ్

telangana state
తెలంగాణ రాష్ట్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడినపుడు దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా అవతరించింది. కానీ ఇపుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఉద్యోగుల వేతనాలతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు డబ్బుల ఇవ్వలేని దుస్థితి నెలకొంది. 
 
తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. పైగా కొత్తగా అప్పులు పుట్టడం లేదు. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచివుంది. ప్రస్తుతం ఉన్న అవసరాలను తీర్చడానికి కూడా సరిపడిన మొత్తంలో ఖజానాలో డబ్బులు లేకపోవడంతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. దీంతో జూన్ నెల అవసరాలను ఏ విధంగా తీర్చాలన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
జూన్ నెల గడవాలంటే కనీసం రూ.20 వేల కోట్లు అవసరమవుంది. కేంద్రం తెలంగాణాకు పెడుతున్న కొర్రీలతో ఎక్కడా పైసా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, సంక్షేమ పథకాల అమలుపై ఈ నిధుల కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
దీంతో తెలంగాణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన చేస్తోంది. జూన్ 4లోపు తెలంగాణ విషయంలో కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరులో మార్పు రాకపోతే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.