గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (13:12 IST)

నుపుర్ శర్మ తలకు కోటి రూపాయల రివార్డు.. ఎందుకంటే?

Nupur Sharma
Nupur Sharma
మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం సంఘాలు ఆమెపై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల పోలీస్ స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. 
 
తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఖావీ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేసే వాళ్ల తలకు కోటి రూపాయల రివార్డు ఇస్తానని గతంలోనే తాను ప్రకటించినట్లు గుర్తు చేశారు. 
 
ప్రత్యేకించి వసీం రిజివి విషయంలో అలా కామెంట్స్ చేశానన్నారు. మళ్లీ అదే విషయాన్ని ఇప్పుడూ చెప్తున్నా.. నుపుర్ శర్మ తలకు కోటి రూపాయల రివార్డు వుంటుందని పునరుద్ఘాటించారు. మహ్మద్ ప్రవర్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు ద్వారా ముస్లిం మనోభావాలను నుపుర్ శర్మ కించపరిచారంటూ ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది. 
 
ఒక న్యూస్‌ చర్చ కార్యక్రమంలో భాగంగా నుపుర్‌ శర్మ మహ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై కేసు నమోదైందని పోలీసు అధికారులు తెలిపారు. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై ఇప్పటికే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది.
 
All India Majlis-E-Inquilab-E-Millat, Inquilab, president,Rs 1 crore, reward, head, Nupur Sharma, నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్త, బీజేపీ అధికార ప్రతినిధి, కేసు, హైదరాబాద్