గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (18:17 IST)

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం

putin
ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై రెండు నెలల క్రితం హత్యా యత్నం జరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ నిఘా విభాగం అధినేత మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ వెల్లడించారు. 
 
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య గత ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా సేనలు నరమేథం సృష్టిస్తున్నారు. 
 
ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యాయత్నం నుంచి బయటపడినట్లు ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ తెలిపారు. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే పుతిన్ ఆరోగ్యంపై వివిధ రకాలైన పుకార్లు వచ్చిన విషయం తెల్సిందే.
 
అయితే, పుతిన్‌పై దాడి విఫలమైందని కాకసస్ అధికారులు తెలిపారు. బుడనోవ్ ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన కొద్దిసేపటికే పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. అయితే ఈ దాడికి ఉక్రెయిన్‌కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
2017లో తనను ఐదుసార్లు టార్గెట్ చేశారని పుతిన్ చెప్పారు. మరోవైపు పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. అనేక మీడియా సైట్ల ప్రకారం, అతను ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు.