సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (17:38 IST)

తైవాన్‌ను ఆక్రమించనున్న చైనా? గట్టి వార్నింగ్ ఇచ్చిన జో-బైడన్

china
తైవాన్‌ను జయించేందుకు చైనా రంగంలోకి దిగనుందని వార్తలు వస్తున్నాయి. చైనా సైనిక ఉన్నతాధికారుల ఆడియో లీక్ సంచలనం సృష్టిస్తోంది. తైవాన్‌ను జయించడానికి షీ జిన్‌పింగ్ మిలటరీ ప్లాన్‌ను ప్రభుత్వంలోని కీలక అధికారి బైటపెట్టినట్లు ఓ యూట్యూబ్ ఛానల్ ప్రకటించింది. 
 
ఈ వైరల్ ఆడియో క్లిప్‌ను చైనా మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్ హంగ్, ట్వీట్ చేయడంతో బీజింగ్ రగిలిపోతోంది. ఇది 57 నిమషాల ఆడియో క్లిప్. చైనా చరిత్రలోనేనే సైనిక ఉన్నతాధికారుల క్లిప్ లీక్ ఒకటి లీక్ కావడం కావడం ఇదే మొదటిసారి. కాని ఇంతవరకు అధికారికంగా ఇంతవరకు చైనా స్పందించలేదు.
 
తైవాన్ ఆక్రమణపై, చైనా సైనిక ఉన్నతాధికారుల ఆడియో క్లిప్ రిలీజ్ అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడన్ స్పందించారు. ఇది ప్రమాదంతో సయ్యాటగా బీజింగ్ ను అభివర్ణించారు. క్వాడ్ సమ్మిట్ కోసం బైడన్, జపాన్‌లో పర్యటిస్తున్నారు. స్వీయపాలనలో ఉన్న తైవాన్‌ను ఆక్రమించాలని చూస్తే, సైనికపరంగా అడ్డుకొంటామని చెప్పారు.
 
వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అలాగని తైవాన్‌ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే, తాము సైనికపరంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. తైవాన్‌ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు డ్రాగన్ కంట్రీకి లేదని బైడెన్ తేల్చేశారు. 
 
ఉక్రెయిన్‌ను ప్రస్తావిస్తూ, చైనాను భయపెట్టే మాటలన్నారు. తైవాన్‌ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్‌ హితవు పలికారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న అకృత్యాలకు, పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చేశారు.