సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (13:50 IST)

ఏషియన్ గేమ్స్‌ను నివరధికంగా వాయిదా

asian games
ఏషియన్ గేమ్స్ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ యేడాది సెప్టెంబరు 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగాల్సివున్న ఏషియన్ గేమ్స్ నిరవధికంగా వాయిస్తున్ననట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రీడలను చైనాలో హోంగ్ఝూ నగరంలో నిర్వహించాల్సివుంది. 
 
అయితే, కరోనా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ కారణంగా ఈ గేమ్స్‌ను వాయిదా వేశారు. ప్రస్తుతం చైనాలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీంతో అనేక నగరాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో కోట్లాది మంది తమతమ ఇళ్లకే పరిమితమైవున్నారు.
 
పైగా, చైనా దేశంలో విశ్వరూపం దాల్చిన కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఈ క్రీడలను వాయిదా వేస్తున్నట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రకటించింది. 
 
త్వరలోనే ఈ క్రీడా నిర్వహణకు కొత్త తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. గత నెలలో అన్ని ఈవెంట్లకు సంబంధించి హోంగ్ఝూలో 56 పోటీ వేదికలను నిర్మించామని ఏషియన్ గేమ్స్ నిర్వహకులు వెల్లడించారు.