గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:22 IST)

జూన్ 3న వస్తోన్న మేజర్.. ఎఫ్-3 కోసం వాయిదా

Sivani-AdaviSesh
హీరో అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న తాజా సినిమా మేజర్. ఈ సినిమాను మే 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
మే 27న తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున ప్రేక్ష‌కుల‌ ముందుకు ఈ సినిమా వస్తుందని నిర్మాతలు అన్నారు. అయితే అదే తేదీన వెంకటేశ్‌, వరుణ్ తేజ్ ఎఫ్ 3 మూవీ సైతం విడుదల అవుతోంది. దాంతో మేజర్‌ను ఇప్పుడు ఓ వారం పోస్ట్ పోన్ చేసి జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
 
జూన్ 3న కూడా మేజర్‌కు దేశ వ్యాప్తంగా గట్టి పోటీ ఉండబోతోంది. ఇప్పటికే జూన్ 3న అజయ్ దేవ్ గన్ మైదాన్ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.