శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (13:42 IST)

మాస్క్ ధరించని కిమ్... నియంతలో మానవత్వం.. కోవిడ్ రూల్స్ ఏమైంది?

Kim Jong Un
Kim Jong un
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నియంతగా అందరికీ బాగా తెలుసు. అలాంటి వ్యక్తి శవపేటికను మోశారంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే.. అవును కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే మరణం.. అక్కడి ప్రభుత్వవర్గాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఆయన అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని తన గురువుకి నివాళి అర్పించారు కిమ్. 
 
అంతేకాదు.. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించిన వేళ ఆయన మాత్రం మాస్క్‌ లేకుండానే గురువుకి గౌరవం ఇచ్చారు. 
 
మే 12న అక్కడ తొలి కరోనా కేసు ప్రకటన వెలువడగా.. అప్పటి నుంచి మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చివరకు కిమ్‌ కూడా మాస్క్‌ను వదలలేదు. అలాంటి గురువు శవపేటిక మోసే సమయంలో మాత్రం మాస్క్‌ను పూర్తిగా పక్కనపెట్టారు.
 
కిమ్‌ జోంగ్‌-2 2011లో చనిపోయిన తర్వాత.. కిమ్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో హ్యోన్‌ చొల్‌ హయే కీలక పాత్ర పోషించారు.