శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (19:27 IST)

ఐపీఎల్‌ 2022: రాజీనామా చేయనున్న సౌరవ్ గంగూలీ? అలాంటిదేమీ లేదన్న షా

ganguly
ఐపీఎల్‌ 2022లో భాగంగా ఇటీవల ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై వివాదం చెలరేగింది. గంగూలీ విరుద్ధ ప్రయోజనాల కోసమే ఇలా చేశాడని కోల్‌కతా అభిమానులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో పిచ్ క్యూరేటర్‌ని ప్రలోభాలకి గురిచేసే అవకాశం ఉందని అభిమానులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. 
 
గత వారమే ముగిసిన మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపొందింది. గంగూలీ ఇంకా ఆ మ్యాచ్ విషయంలో కోపంగానే ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ని కలిసిన గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడి పదవులు విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు రావని వివరణ ఇచ్చాడు. దానికి క్రికెట్ సలహా కమిటీ గురించి ప్రశ్నలు మొదలవడంతో రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
 
2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ, కోవిడ్-19 కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడు ఎడిషన్లను జే షా కార్యదర్శిగా నియమించారు. ఇక తాజా సౌరవ్ గంగూలీ ట్వీట్ సంచలనం సృష్టించిన తరువాత, బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా చేయలేదని జయ్ షా స్పష్టం చేశాడు.