ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (11:09 IST)

బెడ్ సీన్లను ఎన్నిసార్లు చిత్రీకరించారు.. మాళవిక కౌంటర్ యాన్సర్

Malavika mohan
Malavika mohan
ప్రస్తుతం సెలబ్రెటీలు అందరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అయితే సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీలకు ఫాలోవర్స్ బాగానే వుంటారు. కానీ మరి కొందరు ట్రోల్ ఎదుర్కుంటారు. 
 
తాజాగా హీరోయిన్ మాళవికా మోహన్‏కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఎప్పుడు నెట్టింట్లో యాక్టివ్‌గా ఉండే మాళవికా.. తాజాగా అభిమానులతో #AskMalavika అంటూ ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.
 
తమిళ్ స్టార్ హీరో ధనుష్‏తో కలిసి నటించిన సినిమాలో బెడ్ సీన్లను ఎన్నిసార్లు చిత్రీకరించారని అంటూ నెటిజన్స్ పిచ్చి ప్రశ్న వేయగా.. మాళవిక స్పందించింది. "ముందు నీ తలలో ఏదో పాడైనట్లుంది.."అంటూ తన స్టైల్లో మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
 
మాళవిక.. పెట్టా, మాస్టర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జయాల్‏తో కలిసి యుధ్రా అనే సినిమాలో నటిస్తోంది. 
 
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ సినిమా చేయాలనుందంటూ ఇటీవలే తన మనసులోని మాటలను బయట పెట్టింది ఈ అమ్మడు.