సారీ! మిమ్మల్ని కలవలేకపోయాను - ఎన్.టి.ఆర్.
హీరో ఎన్.టి.ఆర్. పుట్టినరోజు మే 20. శుక్రవారం. కానీ గురువారం అర్థరాత్రి నుంచే జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి అభిమానులు తండోపతండాలుగా విచ్చేశారు. విషయం తెలిసిన పోలీసు అధికారులు అక్కడికి వచ్చి వారిని కంట్రోల్ చేశారు. శుక్రవారం ఉదయం కూడా మరింతగా అభిమానులు రావడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే క్రమంలో చిన్నపాటి లాఠీ ఛార్జీ చేసినా ఎవ్వరూ భయపడకపోగా ఎన్.టి.ఆర్. జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం విశేషం.
ఉదయమే ఎన్.టి.ఆర్. ఇంటి పైనుంచి చూశారని అక్కడి అభిమానుల్లో నెలకొంది. కానీ తను ఇంటి వద్ద లేవనీ అంటూ అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.
నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు, వెల్ విషర్‌కూ, నన్ను చూడడానికి వచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారీ నా పుట్టినరోజునాడు వివిధ ప్రాంతాలనుంచి వచ్చే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ అందరినీ నేను కలువలేకపోయాను. అందుకు సారీ! చెబుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఇంటిలో లేను.
నాపై మీరు పెంచుకున్న ప్రేమకు నేను దాసుడ్ని అయ్యాను. మీ గుండెలో స్థిరసాయిగా వుండేలా చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో మీ అందరినీ కలుస్తాను.. అంటూ పేర్కొన్నారు.