మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (11:07 IST)

ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు.. ఇంటిముందు రచ్చ రచ్చ

jr ntr1
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు నేడు పుట్టిన రోజు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఇంటి వద్ద వందలాదిమంది అభిమానులు హంగామా సృష్టించారు. అర్ధరాత్రే ఎన్టీఆర్‌ ఇంటిముందు కేక్‌ కట్‌ చేశారు.
 
ఎన్టీఆర్‌ బయటికి వస్తారేమోనని చాలాసేపు వెయిట్‌ చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై అభిమానులు నానా హంగామా చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. 
 
అభిమానుల అల్లరి శృతిమించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. తారక్‌ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 
 
పోలీసులు భారీగా చేరుకొని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఇంటి వద్ద వందలాదిమంది అభిమానులు హంగామా సృష్టించారు. అర్ధరాత్రే ఎన్టీఆర్‌ ఇంటిముందు కేక్‌ కట్‌ చేశారు.
 
ఎన్టీఆర్‌ బయటికి వస్తారేమోనని చాలాసేపు వెయిట్‌ చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై అభిమానులు నానా హంగామా చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. పోలీసులు భారీగా చేరుకొని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.