భయం కంటే గొప్ప దేవుడు లేడు అంటోన్న ఎన్.టి.ఆర్.
ఎన్.టి.ఆర్. కథానాయకుడిగా నటిస్తున్న 30వ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఫ్యూరీ ఆఫ్ ఎన్.టి.ఆర్. అంటూ ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో తెలుగు, హిందీ, మలమాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఎన్.టి.ఆర్. పుట్టినరోజు మే20. అందుకే ఒకరోజు ముందుగానే వీటిని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అందులో ఏముందంటే.
అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలీదు. అవసరానికి మించి తను వుండకూదని.. అప్పుడు భయానికి తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా.. అంటూ ఎన్.టి.ఆర్. డైలాగ్‌తో విడుదలైంది. సముద్రం అలలు, పడవలు వున్న ఈ ప్రోమోలో బ్యాక్‌గ్రౌండ్ సంగీతం ఆసక్తి కలిగింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ బాణీలు సమకూరుస్తున్నారు. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.